టీమిండియాకు భారీ షాక్‌..

Published on Thu, 01/08/2026 - 21:47

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ  ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది.

"తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్‌ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. నొప్పి త‌గ్గిన త‌ర్వాత అత‌డు త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏమి జరిగిందంటే?
 తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్‌కోట్‌లో గోకుల్‌కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.

అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్‌ ఈ సిరీస్‌కు దూరమైనా టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)