Breaking News

అరటిపండ్లకు రూ.35 లక్షలు ఖర్చు? బీసీసీఐకి హైకోర్టు నోటీసులు

Published on Wed, 09/10/2025 - 17:05

ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU)లో రూ.12 కోట్ల స్కామ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సీఏయూ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. టోర్నమెంట్స్ కోసం కేటాయించిన ఫండ్స్‌ను దారిమళ్లించారని, వాటిపై విచారించాల‌ని  కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.

దీంతో ఆరోపణలపై విచారణ జరిపించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం రూ.35 లక్షలకు ఖర్చు చేశారని పిటిషనర్ ఆరోపించారు.

2024-25 ఏడాదికి గానూ సీఏయూ ఆడిట్ నివేదికపై ద‌ర్యాప్తును కోరుతూ సంజ‌య్ రావత్ అనే వ్య‌క్తి వాజ్యం దాఖలు చేశారు. దీనిపై జ‌స్టిస్ మనోజ్ కుమార్ తివారీ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మం‍గళవారం విచారణ జరిపింది. ఈ ఫిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ బోర్డు నిర్వహించే అన్ని టోర్నమెంట్లకు సీఎయూ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈవెంట్ మెనెజ్‌మెంట్ ఫీజుల కోసం రూ.6.4 కోట్లు,  టోర్నమెంట్ల నిర్వహణ, ట్రయల్స్ కోసం రూ.26.3 కోట్లు చేసినట్లు సంజయ్ రావత్ తన ఫిటిషన్‌లో పేర్కొన్నారు. 

కాగా ఈ ఖర్చు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 22.30 కోట్లే ఉంది. ముఖ్యంగా ఆహార ఖర్చుల పేరుతో అసోసియేషన్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై బీసీసీఐ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.
చదవండి: ఆ జట్టు ఓటమి ఖాయమే!.. టీమిండియా నుంచి ఎవరిని తప్పిస్తారు?: అక్తర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)