Breaking News

విరాట్, రోహిత్ రిటైర్మెంట్‌ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్‌ సంచలన కామెంట్స్‌

Published on Sat, 08/16/2025 - 15:43

భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో రాహుల్ ద్ర‌విడ్‌, వీవీఎస్ లక్ష్మణ్ త‌మ‌కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు త‌మ సేవ‌ల‌ను అందించిన ఈ ఇద్ద‌రి లెజెండ‌రీ క్రికెట‌ర్ల‌కు స‌రైన వీడ్కోలు మాత్రం ల‌భించింది.

ఈ కోవ‌కు చెందిన వారే టీమిండియా దిగ్గ‌జాలు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు. వారిద్ద‌రూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా త‌మ టెస్టు కెరీర్‌ల‌ను ముగించారు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నకు ముందు రోహిత్‌, కోహ్లిలు వారం రోజుల వ్య‌వ‌ధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అందిరికి షాకిచ్చారు.

ఈ సీనియ‌ర్ ద్వ‌యం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భార‌త జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల‌ సిరీస్‌ను 2-2తో స‌మంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్‌, కోహ్లి రిటైర్మెంట్‌ల‌పై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీసీసీఐలో రాజ‌కీయాల వ‌ల్లే వారిద్ద‌రూ త్వ‌ర‌గా రిటైర‌య్యార‌ని ఆయ‌న ఆరోపించాడు.

"వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ప్ర‌స్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లి ఒక‌డు. మ‌రో మూడేళ్ల‌ పాటు భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడే స‌త్తా  కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌కటించ‌డం వెన‌క కొన్ని శక్తులు ఉన్నాయ‌ని నేను అనుకుంటున్నాను.

అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భార‌త జ‌ట్టుకు త‌న సేవ‌లను అందించిన విరాట్‌కు బీసీసీఐ క‌నీసం ఫేర్‌వెల్ కూడా ఏర్పాటు చేయ‌లేదు.  కోహ్లి, రోహిత్ వంటి ఆట‌గాళ్లు ఘన‌మైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని  అంతర్గత రాజకీయాల కారణంగా జ‌రిగింది.

దీనిని మ‌నం అర్థం చేసుకోవడం చాలా క‌ష్టం. ఈ కారాణాల‌తోనే కోహ్లి త్వ‌రగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. రోహిత్ శ‌ర్మ కూడా కావాల‌నుకుంటే మ‌రి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్ద‌లు అత‌డిని జ‌ట్టు నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)