Breaking News

బీసీసీఐ ఉదారత.. శ్రీలంక తుఫాన్‌ బాధితుల కోసం ప్రత్యేక సాయం

Published on Fri, 01/02/2026 - 18:01

పొరుగు దేశాలను ఆదుకునే విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మరోసారి తమ ఉదారత చాటుకుంది. డిట్వా తుఫానుతో అతలాకుతలమైన శ్రీలంకకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక సాయంతో ముందుకొచ్చింది. భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో శ్రీలంకలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

డిట్వా తుఫాన్‌ బాధితుల సహాయార్థం బీసీసీఐ ఈ టూర్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. టెస్ట్‌లకు అదనంగా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించింది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిట్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు షెడ్యూల్‌లో లేని టూర్‌ ఎక్స్‌టెన్షన్‌ను ప్లాన్‌ చేసింది.

ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధ్యక్షుడు షమ్మి సిల్వా ధృవీకరించారు. భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న సహృదయ వాతావరణాన్ని, పెరుగుతున్న స్నేహాన్ని ప్రస్తావించారు. అదనపు టీ20ల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

వాస్తవానికి తాజా పరిణామానికి ముందే భారత జట్టు డిసెంబర్‌లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు (డిట్వా తుఫాన్‌ బాధితులకు నిధులు సమకూర్చేందుకు) ఒప్పుకుంది. ఆ పర్యటనలో భారత్‌-శ్రీలంక జట్లు రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ కార్యరూపం దాల్చకముందే, బీసీసీఐ ఆగస్ట్‌ విండో ప్రతిపాదనకు సమ్మతించింది.

కాగా, గతేడాది నవంబర్ చివర్లో డిట్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలు
డిట్వా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను “Rebuilding Sri Lanka” కార్యక్రమానికి అంకితం చేసింది. ఈ సిరీస్‌లో #VisitSriLanka పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)