Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌పై అగార్కర్ సీరియస్‌!?

Published on Sat, 03/02/2024 - 17:20

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషాన్‌ ప్రస్తుతం భారత క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. అందుకు కారణం వారిద్దరిని బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల నుంచి తప్పించడమే. 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో శ్రేయస్‌, ఇషాన్‌ పేర్లు లేవు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది.

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్‌.. మానసిక సమస్యల కారణం చెప్పి ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌కు వచ్చిన కిషన్‌.. హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సిద్దమయ్యాడు.

ఈ క్రమంలో  భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం కిషాన్‌ రీ ఎంట్రీ ఇవ్వాలంటే రంజీల్లో ఆడాల్సిందే అని సృష్టం చేశాడు. కానీ బోర్డు, ద్రవిడ్‌ మాటలను కిషన్‌ పెడచెవిన పెట్టాడు. మరోవైపు అయ్యర్‌ది కూడా ఇదే తీరు. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్‌ను ఫామ్‌ లేమి కారణంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

ఈ క్రమంలో రంజీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్‌ ఆసోషియేషన్‌ శ్రేయస్‌ను కోరింది. కానీ అయ్యర్‌ మాత్రం వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని చెప్పేశాడు. అయితే అంతకముందు రోజే అయ్యర్‌ ఫిట్‌గా ఉన్నాడని ఏన్సీఏ సర్టిఫికేట్‌ను మంజారు చేసింది. దీంతో అయ్యర్‌ కావాలానే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. బీసీసీఐ కూడా ఇదే విషయంపై సీరియస్‌ అయినట్లు వార్తలు వినిపించాయి.

అయితే అ‍య్యర్‌పై బీసీసీఐ వేటు వేయడానికి మరో కారణం కూడా ఉందంట. వెన్ను నొప్పి సాకు చెప్పి అయ్యర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రీ ఐపీఎల్‌ ట్రైనింగ్‌లో పాల్గొనున్నట్లు సమచారం. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్ అయ్యర్‌పై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే అయ్యర్‌ను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించాలని సెలక్షన్‌ కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అయ్యర్‌ ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.
చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)