Breaking News

T20 World Cup 2021: ఉమ్రాన్‌ మాలిక్‌కు బంపర్‌ ఆఫర్‌!

Published on Sun, 10/10/2021 - 11:26

Umran Malik As Net Bowler In T20WC For Team India.. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. టి20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి టీమిండియా జట్టుకు ఉమ్రాన్‌ మాలిక్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ మేరకు ఉమ్రాన్‌ మాలిక్‌ను వెంటనే టీమిండియా బయోబబుల్‌లో జాయిన్‌ కావాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. ఐఏఎన్‌ఎస్‌ అనే వార్త సంస్థ  ఈ విషయాన్ని తమ ట్విటర్‌లో చెప్పుకొచ్చింది.


Courtesy: IPL Twitter

టి20 ప్రపంచకప్‌లో ఆడకపోయినప్పటికి.. ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీలో నెట్‌బౌలర్‌గా వ్యవహరించడం కూడా అదృష్టం కిందే భావించొచ్చు. ఒకవేళ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్‌ ఎవరైనా గాయపడితే ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్‌ డెబ్యూ ఐపీఎల్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌  తరపున మ్యాచ్‌లు ఆడే అవకాశం తక్కువగానే వచ్చినప్పటికీ ప్రతీదాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.


Courtesy: IPL Twitter

ముఖ్యంగా అత్యంత వేగంగా బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఉమ్రాన్‌ ప్రతీ బంతిని కనీసం గంటకు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్‌.. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా గంటకు 152.95 కిమీ వేగంతో విసిరి కొత్త రికార్డు నమోదు. ఉమ్రాన్‌ దెబ్బకు సూర్యకుమార్‌ విలవిలలాడిన సంగతి తెలిసిందే. ''అతని బౌలింగ్‌ వేగమే ఇవాళ టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు నెట్‌బౌలర్‌గా వ్యవహరించే అవకాశం కల్పించిందని.. అత్యంత వేగవంతమైన బంతులు విసురుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్‌ టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆడాలని చాలా మంది ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

చదవండి: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత ఫాస్ట్‌బాల్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే

Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు

Videos

ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!

హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రష్మిక.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్...

Photos

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)