Breaking News

అరుంధతి రెడ్డి తొలిసారి...

Published on Tue, 03/25/2025 - 04:52

న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్‌లు అందించింది. గత సీజన్‌లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది.  2022 అక్టోబర్‌ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్‌ బ్యాటర్‌ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్‌ జాబితాలో స్థానం లభించలేదు.

 హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్‌ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడింది.  ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్‌ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్‌ ప్లేయర్లు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, ఓపెనర్‌ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ నీతూ డేవిడ్‌ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్‌లను అందించింది. 

భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితా 
గ్రేడ్‌ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.  
గ్రేడ్‌ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ. 
గ్రేడ్‌ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్‌ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్‌ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్‌.  

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)