Breaking News

జగజ్జేత భారత్‌కు భారీ నజరానా

Published on Sat, 02/07/2026 - 12:30

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026 విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్‌ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్‌ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 

చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్‌ పలు రికార్డులు సొంతం చేసుకుంది.

దేశమంతా గర్విస్తుంది
జగజ్జేత భారత్‌కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్‌పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు.  

ప్రధాని అభినందనలు  
ఆరోసారి ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.  

ఆరోసారి 
తాజా టైటిల్‌తో భారత్‌ ఆరోసారి అండర్ 19 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్‌ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.

కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్‌ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు.  

అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్‌ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్‌ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.


 

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)