Breaking News

ఒక్క బంతికే 16 పరుగులు.. ఎంత పని చేశావయ్యా స్టీవ్‌ స్మిత్‌

Published on Mon, 01/23/2023 - 19:14

సాధారణంగా ఓ బంతికి 7 పరుగులు (నోబాల్‌+సిక్స్‌), మహా అయితే 13 పరుగులు (నోబాల్‌+సిక్స్‌+సిక్స్‌) రావడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ బంతికి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో ఇదెలా సాధ్యపడిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరా తీయడం మొదలుపెట్టారు.

వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ బౌలర్‌ జోయల్‌ పారిస్‌ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ వేసిన పారిస్‌.. తొలి రెండు బంతులను డాట్‌ బాల్స్‌ వేశాడు. ఆ తర్వాత బంతిని స్టీవ్‌ స్మిత్‌ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు.

దీంతో బంతి కౌంట్‌ కాకుండానే సిక్సర్స్‌ జాబితాలో 7 పరుగులు చేరాయి. ఆతర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్‌+ఫోర్‌) రావడంతో బంతి కౌంట్‌లోకి రాకుండానే సిక్సర్స్‌ ఖాతాలో 12 పరుగులు జమయ్యాయి. ఇక పారిస్‌ నెక్స్‌ వేసిన లీగల్‌ బంతిని స్మిత్‌ బౌండరీకి తరలించడంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి సిక్సర్స్‌ ఖాతాలో 16 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ రేర్‌ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.  

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్‌.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

హరికేన్స్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సిక్సర్స్‌ బౌలర్లలో జాక్సన్‌ బర్డ్‌, సీన్‌ అబాట్‌, హేడెన్‌ కెర్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నవీద్‌ ఓ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)