Breaking News

బుమ్రా, పంత్‌ క్షమాపణ చెప్పారు

Published on Thu, 12/25/2025 - 03:58

జొహన్నెస్‌బర్గ్‌: భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో తన ఎత్తు విషయంలో ఎదుర్కొన్న వ్యాఖ్య గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్‌ బుమ్రా, కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ విషయంలో చర్చించుకుంటూ బవుమా గురించి ‘మరుగుజ్జు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత వివాదం రేగింది. అయితే ఆ తర్వాత వారిద్దరు తనకు క్షమాపణలు చెప్పారని బవుమా స్పష్టం చేశాడు. 

నిజానికి ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో కూడా తనకు తెలీదని అతను వెల్లడించాడు. ‘నిజానికి బుమ్రా, పంత్‌ నన్ను క్షమాపణలు కోరినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాలేదు. మా మీడియా మేనేజర్‌ను అడిగి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. వారి భాషలో నా గురించి ఏదోలా మాట్లాడుకున్నారని అర్థమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత నా వద్దకు వచ్చి వారు సారీ చెప్పారు. 

మైదానంలో జరిగిన విషయాలు అక్కడే ముగిసిపోతాయి. కానీ ఏం అన్నారో మర్చిపోలేం కదా. అవి మరింత బాగా ఆడేందుకు ప్రేరణ అందిస్తాయి. అయితే నాకు ఎలాంటి విద్వేషభావం లేదు’ అని బవుమా వివరించాడు. మరోవైపు గువాహటిలో జరిగిన రెండో టెస్టు సమయంలో భారత ఆటగాళ్లను ‘మోకాళ్లపై కూర్చోబెడతాను’ అంటూ దక్షిణాఫ్రికా కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ అనడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. 

ఈ విషయంలో షుక్రిని తప్పుబట్టిన బవుమా... అతను మరింత మెరుగైన భాషను వాడాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత గడ్డపై కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించానని...వాటిని అధిగమించి 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ గెలవడం చాలా గొప్పగా అనిపించిందని బవుమా తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)