Breaking News

సూర్య, డివిలియర్స్‌నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు?

Published on Thu, 06/29/2023 - 18:34

క్రికెట్‌లో వినూత్న షాట్లకు పెట్టింది పేరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌.. టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు బాదే ఈ ఇద్దరు క్రికెటర్లు మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్స్‌గా పేరు పొందారు. స్విచ్‌ హిట్‌, స్కూప్‌ షాట్‌, స్క్వేర్‌కట్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్‌ పుస్తకాల్లో లేని షాట్లను కూడా వీళ్లు ఆడి అభిమానులను అలరించారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇద్దరు తమ వినూత్న ఆటతీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు.

ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్‌ మాత్రం సూర్య, ఏబీడీలను మించిపోయాడు. వీరిద్దరు వికెట్ల ముందు ఉండే వినూత్న షాట్లు ఆడడంలో నేర్పరులు అయితే.. ఇతను మాత్రం రూల్స్‌కు విరుద్దంగా వికెట్ల వెనకాలకు వెళ్లి మరీ స్కూప్‌ షాట్‌ ఆడాడు. బౌలర్‌ బంతి వేసేవరకు వెయిట్‌ చేసిన బ్యాటర్‌ ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్ల వెనక్కి వెళ్లి వికెట్‌ కీపర్‌ తలపై నుంచి స్కూప్‌ షాట్‌ కొట్టి తన చర్యతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఎక్కడో కాదు మన దేశంలోనే ఒక లోకల్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. వీడియో చూసిన అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ''మిస్టర్‌ 1080..''..''రూల్స్‌కు విరుద్దంగా క్రికెట్‌ ఆడి పరువు తీస్తున్నాడు.. దమ్ముంటే వికెట్ల ముందే ఉండి ఈ షాట్‌ ఆడి చూపించు'' అని సవాల్‌ చేశాడు.

చదవండి: అభిమానుల డిమాండ్‌; అశ్లీల వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయిన ఫుట్‌బాలర్‌

మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్‌..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)