Breaking News

23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌

Published on Wed, 02/25/2026 - 12:48

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ డార్విన్‌ వేదికగా ఆగస్ట్‌ 13-17 మధ్య తేదీల్లో జరుగుతుంది. రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్ట్‌ 22-26 మధ్య జరుగనుంది. 

బంగ్లాదేశ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇది నాలుగో టెస్ట్‌ సిరీస్‌ ఆవుతుంది. ఇందులో​ ఆరు మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. 2017లో మీర్పూర్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది.

కాగా, బంగ్లాతో హోం సిరీస్‌తోనే 2026-27 సీజన్‌ ఆసీస్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌ తర్వాత ఆసీస్‌ మూడు టెస్ట్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆతర్వాత నవంబర్‌ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్‌ జట్టు నాలుగు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 

జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత్‌లో 5 మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ జరుగనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్‌తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

సౌతాఫ్రికాలో టెస్ట్‌ సిరీస్‌
అక్టోబర్‌ 9-13: తొలి టెస్ట్‌, డర్బన్‌
అక్టోబర్‌ 18-22: రెండో టెస్ట్‌, గ్వెబెర్హా
అక్టోబర్‌ 27-31: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్‌

  • ఈ పర్యటనలో ఆసీస్‌ మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 24 (డర్బన్‌), 27 (జోహనెస్‌బర్గ్‌), 30 (పోచెఫ్‌స్ట్రూమ్‌) తేదీల్లో జరుగుతాయి.

ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్ట్‌ 
2027, మార్చి 11-15: ఏకైక టెస్ట్‌, ఎంసీజీ

ఆసీస్‌లో న్యూజిలాండ్‌ పర్యటన.. భారత్‌లో ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలోనే వైదొలిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ జట్టు పునఃదర్శనం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌తోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌, పాకిస్తాన్‌ లీగ్‌ తదితర ప్రైవేట్‌ లీగ్‌లతో పాటు దేశవాలీ టోర్నీల్లో ఆడతారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)