Breaking News

టీమిండియాతో టీ20 సిరీస్‌ విజయం మాదే: బంగ్లా కెప్టెన్‌

Published on Fri, 10/04/2024 - 20:57

టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఇప్పుడు అదే జట్టుతో  మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైం‍ది. ఆక్టోబర్‌ 6న గ్వాలియర్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు.

"భారత్‌తో టీ20 సిరీస్‌కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్‌ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్‌కు చేరుకోలేకపోయాము.

మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్‌పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్‌తో టెస్ట్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము  ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్‌కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)