Breaking News

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం

Published on Mon, 01/12/2026 - 13:58

భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్‌ టీమిండియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. 

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరుగబోయే మ్యాచ్‌లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉ‍ద్రిక్తతల నేపథ్యం
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.

ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్‌ చేసింది. భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌ విధుల నిమిత్తం భారత్‌కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ  వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

బోణీ కొట్టిన టీమిండియా
తొలి వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల​్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం భారత్‌ విరాట్‌ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49), ఆఖర్లో ఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది. 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?