బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం!

Published on Mon, 02/23/2026 - 19:23

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ మొన్‌జురుల్‌ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.

అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్‌-2022 సందర్భంగా మొన్‌జురుల్‌ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్‌ జట్టు నాటి కెప్టెన్‌ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. 

స్వతంత్ర విచారణ కమిటీ
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్‌-ఏ- బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.

జహనారా ఆరోపించినట్లుగానే మొన్‌జురెల్‌కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్‌ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.

నిషేధం విధిస్తున్నాం
ఈ క్రమంలో మొన్‌జురుల్‌ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.

కాగా బంగ్లాదేశ్‌ మహిళల జట్టు సెలక్టర్‌, మేనేజర్‌గా మొన్‌జురుల్‌ వ్యవహరించాడు. గతేడాది జూన్‌ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్‌ ఘాజి ఆష్రఫ్‌ హొసేన్‌ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

చారిత్రాత్మ​క ముందుడుగు
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చారిత్రాత్మక​ ముందడుగు వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్‌కు ఏప్రిల్‌ 4- 14 వరకు షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

Videos

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!