బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు మరో భారీ షాక్‌!.. ఇక ఖేల్‌ ఖతం​?

Published on Fri, 01/09/2026 - 16:01

భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య నెల‌కొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించ‌డంతో ర‌గిలిపోతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది.

ప్రముఖ భారత క్రికెట్ ప‌రికాల సంస్థ సాన్స్పరీల్స్ గ్రీన్లాండ్స్ (SG).. బంగ్లాదేశ్ క్రికెటర్లతో తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్ట‌న్ దాస్‌, మాజీ కెప్టెన్ మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి స్టార్ ప్లేయ‌ర్లకు ఎస్‌జీనే స్పాన్స‌ర్‌గా ఉంది. 

ఇప్పుడు రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మ కాంట్రాక్ట్‌ల‌ను పొడిగించేందుకు ఎస్‌జీ స‌ముఖ‌త చూప‌లేదు. దీంతో బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు తమకు అలవాటైన కస్టమ్-మేడ్ బ్యాట్లను కోల్పోవడమే కాకుండా భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొనున్నారు.

అయితే దీనిపై ఇంకా ఎస్‌జీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే  బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన స్పాన్సర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో భారత దిగ్గజ సంస్థ ఎస్‌ఎస్ కూడా ఎస్‌జీ బాటలో నడిచే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్, సబ్బీర్ రెహమాన్, నాసిర్ హొస్సేన్ వంటి స్టార్ ఆటగాళ్లకు ఎస్‌ఎస్ స్పాన్సర్ ఉంది.

కాగా ఈ వివాదం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌మ జ‌ట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను విడుద‌ల చేయ‌డంతో మొదలైంది. ఐపీఎల్‌-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడులు పెరిగిపోవ‌డంతో ముస్తాఫిజుర్‌ను జ‌ట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జ‌ట్టు నుంచి రీలీజ్ చేయాల‌ని కేకేఆర్‌ను అదేశించింది. దీంతో అత‌డిని కేకేఆర్ విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత భార‌త్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. 

బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి ఆడకపోతే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం త‌మ దేశంలో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను సైతం బ్యాన్ చేసింది.
చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)