చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

Published on Thu, 06/11/2026 - 20:22

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌, ఆరు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 11) జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. 

ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను హస్తగతం​ చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. 

లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

తౌహిద్‌ హృదోయ్‌ (40), కెప్టెన్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (22) అజేయమైన ఇన్నింగ్స్‌లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్‌ (42), నజ్ముల్‌ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 

మిగతా ఆటగాళ్లలో తంజిద్‌ హసన్‌ డకౌట్‌ కాగా.. లిటన్‌ దాస్‌ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్‌ హొసేన్‌ 15 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, మెరిడిత్‌, జంపా, రెన్షా, గ్రీన్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు ఆసీస్‌ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌ ఇంగ్లిస్‌ (34), గ్రీన్‌ (25), అలెక్స్‌ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్‌, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. 

బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (7-2-27-3), తస్కిన్‌ అహ్మద్‌ (8-1-33-3), తన్వీర్‌ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 14న జరుగనుంది. కాగా, ఆసీస్‌కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్‌ ఓటమి. ఈ సిరీస్‌కు ముందు ఆ జట్టు పాకిస్తాన్‌ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)