Breaking News

ఆసియాకప్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్‌ ఆటగాడిపై వేటు

Published on Sat, 08/12/2023 - 11:54

ఆసియాకప్‌-2023కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు బంగ్లా కెప్టెన్సీ నుంచి తమీమ్‌ ఇక్భాల్‌ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను షకీబ్‌కు సెలక్షన్‌ కమిటీ అప్పగించింది. అదే విధంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుంగా రాణిస్తున్న 22 ఏళ్ల తాంజిద్ హసన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

తాంజిద్‌ విషయానికి వస్తే.. ఇటీవల ముగిసిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ యువ ఆటగాడు మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ గత ఏడిషన్‌లో కూడా దుమ్ము రేపాడు. మరోవైపు ఈ  జట్టులో వెటరన్ బ్యాటర్ మహ్ముదుల్లాకు చోటు దక్కలేదు.

అతడు చివరగా ఈ ఏడాది మార్చిలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.

ఆసియాకప్‌కు బంగ్లా జట్టు:  షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, షమీ అహ్మద్, షమీ అహ్మద్, ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్
చదవండి: అవన్నీ నిజం కాదు.. దయచేసి అర్ధం చేసుకోండి: విరాట్‌ కోహ్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)