Breaking News

నాలుగో స్థానానికి ఎగబాకిన బంగ్లాదేశ్‌.. టాప్‌లో టీమిండియా

Published on Tue, 09/03/2024 - 16:25

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారీగా పాయింట్ల శాతాన్ని మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఓటమితో పాక్‌ పాయింట్ల శాతాన్ని మరింత దిగజార్చుకుని ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇటీవలే శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా ఆరులో, శ్రీలంక ఏడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కేవలం ఒకే ఒక విజయం సాధించిన వెస్టిండీస్‌ చిట్టచివరి స్థానమైన తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

కాగా, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ ఫైనల్‌ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మ్యాచ్‌ వచ్చే ఏడాది జూన్‌ 11-15 మధ్యలో లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను (జూన్‌ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్‌లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది.

ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. బంగ్లాదేశ్‌కు పాక్‌లో ఇది తొలి సిరీస్‌ విజయం. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)