Breaking News

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..

Published on Sun, 01/18/2026 - 15:01

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాల్గోనేందుకు త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని మొండి ప‌ట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన  'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను  కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. 

భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. 

ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.
చదవండి: ఇటలీ ప్రపంచకప్‌ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు
 

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు