Breaking News

ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌

Published on Sun, 12/08/2024 - 17:47

ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. 

యుద్ధజిత్‌ గుహా, చేతన్‌ శర్మ, హార్దిక్‌ రాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్‌ చోర్‌మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్‌ మాత్రే తలో వికెట్‌ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో రిజాన్‌ హొసేన్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలువగా..  మొహమ్మద్‌ షిహాబ్‌ జేమ్స్‌ (40), ఫరీద్‌ హసన్‌ ఫైసల్‌ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. అజీజుల్‌ హకీమ్‌ తమీమ్‌ (3/8), ఇక్బాల్‌ హొసేన్‌ ఎమోన్‌ (3/24), అల్‌ ఫహద్‌ (2/34), మరూఫ్‌ మ్రిద (/36), రిజాన్‌ హొసేన్‌ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. 

భారత ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే (1), వైభవ్‌ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మొహమ్మద్‌ అమాన్‌ (26), హార్దిక్‌ రాజ్‌ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్‌ (20), చేతన్‌ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)