Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్‌

Published on Wed, 09/17/2025 - 04:03

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నీలో బంగ్లాదేశ్‌ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్‌–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్‌పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ తన్‌జీద్‌ హసన్‌ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తన్‌జీద్, మరో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి తొలి వికెట్‌కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. 

అయితే ఆ తర్వాత అఫ్గాన్‌ స్పిన్నర్లు నూర్‌ అహ్మద్‌ (2/23), రషీద్‌ ఖాన్‌ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్‌ హృదయ్‌ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్‌ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒమర్జాయ్‌ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. 

చివర్లో రషీద్‌ ఖాన్‌ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్‌ కావడంతో అఫ్గాన్‌ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్‌ రహమాన్‌ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్‌ అహ్మద్, రిషాద్‌ హుస్సేన్‌ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో పాకిస్తాన్‌ ఆడుతుంది.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)