Breaking News

బంగ్లాదేశ్‌ కోచ్‌గా అరివీర భయంకరమైన ఫాస్ట్‌ బౌలర్‌

Published on Mon, 05/12/2025 - 21:24

బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా షాన్‌ టైట్‌ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 42 ఏళ్ల మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ 2027 నవంబర్‌ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. టైట్‌ తన కోచింగ్‌ ప్రయాణంలో పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లకు సేవలందించాడు. 

టైట్‌.. 2007లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆసీస్‌ తరఫున మూడు ఫార్మాట్లలో 59 మ్యాచ్‌లు ఆడిన టైట్‌.. 95 వికెట్లు తీశాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా షాన్‌ టైట్‌ నియామకంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన ఆండ్రీ ఆడమ్స్‌ వైదొలిగాడు. 

ఆడమ్స్‌ గతేడాది మార్చిలో బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆడమ్స్‌ ఆథ్వర్యంలో బంగ్లాదేశ్‌ టీ20 వరల్డ్‌కప్‌ 2024, ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనలు చేసింది. ఈ కారణంగా అతనిపై వేటు పడింది.

క్రికెట్‌ చరిత్రలో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ బాల్‌
షాన్‌ టైట్‌ పేరిట క్రికెట్‌ చరిత్రలో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ బాల్‌ రికార్డు నమోదై ఉంది. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్‌ చరిత్రలోనే అ‍త్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్‌ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు.  

టైట్‌తో పాటు మరో ఆసీస్‌ పేసర్‌ బ్రెట్‌ లీ కూడా 161.1కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ ఈ వేగాన్ని అందుకున్నాడు. 

క్రికెట్‌ చరిత్రలో నాలుగో వేగవంతమైన డెలివరీ రికార్డు కూడా ఆసీస్‌కే చెందిన జెఫ్‌ థాంప్సన్‌ పేరిట ఉంది. థామ్సన్‌ 1975-76 సిరీస్లో విండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 160.6కిమీ వేగంతో బంతిని వేశాడు. క్రికెట్‌ చరిత్రలో ఐదో వేగవంతమైన బంతి రికార్డు కూడా ఆసీస్‌ పేసర్‌ పేరిటే ఉంది. 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టార్క్‌ 160.4కిమీ వేగంతో బంతిని సంధించాడు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌ జట్టు మే 17 నుంచి యూఏఈలో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లా టీమ్‌ యూఏఈతో రెండు టీ20లు (మే 17, 19) ఆడనుంది. అనంతరం​ మే 25 నుంచి బంగ్లా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు ఆడాల్సి ఉం‍ది. అయితే భారత్‌తో యుద్దం తర్వాత పాక్‌లో జరగాల్సిన ఈ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)