Breaking News

భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

Published on Thu, 09/12/2024 - 13:22

టీమిండియాతో రెండు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్‌కు 16 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌కు స్టార్ పేస‌ర్ షోర్‌ఫుల్ ఇస్లాం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.

షోర్‌ఫుల్ ప్ర‌స్తుతం తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు కోలుకోవ‌డానికి మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు బీసీబీ వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే అత‌డు భార‌త ప‌ర్య‌ట‌న‌కు దూర‌మ‌య్యాడు.

 ఈ జ‌ట్టులో అన్‌క్యాప్డ్ ఆటగాడు జాకర్ అనిక్ అలీకి సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. న‌లుగురు పేస‌ర్లు, న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో కూడిన బ‌ల‌మైన జ‌ట్టును బంగ్లా సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. పాకిస్తాన్‌పై చారిత్ర‌త్మ‌క విజయం సాధించిన ఆత్మ విశ్వాసంతో బంగ్లా జ‌ట్టు భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టనుంది.  

టీమిండియాపై కూడా తొలి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని బంగ్లా టైగ‌ర్స్ ప‌ట్టుద‌లతో ఉన్నారు. ఇక సెప్టెంబరు 19 నుంచి చెన్నై వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్‌), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్,  ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఒకే జ‌ట్టులో విరాట్ కోహ్లి, బాబ‌ర్ ఆజం?
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)