Breaking News

టోనీ, ట్రిస్టన్‌ శతకాలు.. భారీ స్కోర్‌ దిశగా సౌతాఫ్రికా

Published on Wed, 10/30/2024 - 06:58

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (141 నాటౌట్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (106) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరికీ టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ఎయిడెన్‌ మార్క్రమ్‌ (33) శుభారంభం లభించినప్పటికీ భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. 

టోనీ డి జోర్జీతో పాటు డేవిడ్‌ బెడింగ్హమ్‌ (18) క్రీజ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు తైజుల్‌ ఇస్లాంకు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో  106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్‌ వెర్రిన్‌ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)