Breaking News

చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీం.. తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డు

Published on Tue, 10/22/2024 - 17:49

బంగ్లాదేశ్‌ వెటరన్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్‌ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ సందర్భంగా రహీం ఈ ఘనత సాధించాడు. రహీం 172 ఇన్నింగ్స్‌ల్లో 38.24 సగటున 6003* పరుగులు సాధించాడు. బంగ్లా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీం తర్వాత తమీమ్‌ ఇక్బాల్‌ (5134), షకీబ్‌ అల్‌ హసన్‌ (4609), మొమినుల్‌ హక్‌ (4269), హబీబుల్‌ బషార్‌ (3026) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్‌ రహీం 31 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రహీంతో పాటు మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (38) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు బంగ్లాదేశ్‌ ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్‌ కైల్‌ వెర్రిన్‌ సూపర్‌ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. వెర్రిన్‌కు వియాన్‌ ముల్దర్‌ (54), డీన్‌ పైడిట్‌ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్‌ రికెల్టన్‌ (27), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్‌ మహమూద్‌ 3, మెహిది హసన్‌ మిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

చదవండి: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌.. కష్టాల్లో బంగ్లాదేశ్‌


 

 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)