సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌.. కష్టాల్లో బంగ్లాదేశ్‌

Published on Tue, 10/22/2024 - 17:25

ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది. 

బంగ్లా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో షద్మాన్‌ ఇస్లాం (1), మొమినుల్‌ హక్‌ (0), నజ్ముల్‌ హసన్‌ షాంటో (23) ఔట్‌ కాగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (38), ముష్ఫికర్‌ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. రబాడ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు పరుగుల వద్ద రబాడ.. షద్మాన్‌ ఇస్లాం, మొమినుల్‌ హక్‌ వికెట్లు పడగొట్టాడు. షాంటో వికెట్‌ కేశవ్‌ మహారాజ్‌కు దక్కింది.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్‌ కైల్‌ వెర్రిన్‌ సూపర్‌ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. వెర్రిన్‌కు వియాన్‌ ముల్దర్‌ (54), డీన్‌ పైడిట్‌ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్‌ రికెల్టన్‌ (27), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్‌ మహమూద్‌ 3, మెహిది హసన్‌ మిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. సఫారీ బౌలర్ల ధాటికి 106 పరుగులకే ఆలౌటైంది. రబాడ, వియాన్‌ ముల్దర్‌, కేశవ్‌ మహారాజ్‌ తలో మూడు వికెట్లు, డీన్‌ పైడిట్‌ ఓ వికెట్‌ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్‌ హసన్‌ (30), తైజుల్‌ ఇస్లాం (16), మెహిది హసన్‌ మిరాజ్‌ (13), ముష్ఫికర్‌ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్‌ రాక.. ఎవరిపై వేటు? కోచ్‌ ఆన్సర్‌ ఇదే

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)