BAN VS PAK 1st Test: సౌద్‌ షకీల్‌ సెంచరీ.. పాక్‌కు ఆధిక్యం

Published on Tue, 07/18/2023 - 13:08

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్‌ ఆధిక్యం సాధించింది. 221/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌.. లంచ్‌ విరామం సమయానికి అఘా సల్మాన్‌ (83) వికెట్‌ (ఆరో వికెట్‌) కోల్పోయి 313 పరుగులు చేసింది. సౌద్‌ షకీల్‌ అజేయ సెంచరీ (119)తో పాకిస్తాన్‌కు లీడ్‌ అందించాడు. ప్రస్తుతం ఆ జట్టు పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. షకీల్‌కు జతగా నౌమన్‌ అలీ (13) క్రీజ్‌లో ఉన్నాడు.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (19), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (1), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (13), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (17) విఫలం కాగా.. షాన్‌ మసూద్‌ (39) పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 3, రమేశ్‌ మెండిస్‌ 2, కసున్‌ రజిత ఓ వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో​ మాథ్యూస్‌ (64) అర్ధశతకంతో రాణించాడు.

లంక ఇన్నింగ్స్‌లో నిషాన్‌ మధుష్క (4), కుశాల్‌ మెండిస్‌ (12), దినేశ్‌ చండీమల్‌ (1), రమేశ్‌ మెండిస్‌ (5), ప్రభాత్‌ జయసూర్య (4), కసున్‌ రజిత (8) విఫలం​ కాగా.. కెప్టెన్‌ కరుణరత్నే (29), సమరవిక్రమ (36), విశ్వ ఫెర్నాండో (21 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, నసీం షా, అబ్రార్‌ అహ్మద్‌ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)