Breaking News

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

Published on Fri, 11/21/2025 - 14:40

ఢాకా (Dhaka) వేదిక‌గా బంగ్లాదేశ్‌ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు (నవంబర్‌ 21) ఆట‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం (Earth Quake)  సంభవించ‌డంతో మైదానంలో ఉన్న ఆట‌గాళ్లంతా ఉలిక్కిపడ్డారు. 

మ్యాచ్‌ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్‌ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.

ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం​ నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్‌ ఘటన ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 56వ ఓవర్‌ రెండో బంతి బౌల్‌ చేస్తుండగా చోటు చేసుకుంది.

కాగా, ఇవాళ ఉదయం  10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆతర్వాత ఐర్లాండ్‌ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం​ సాధించింది. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. 

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!