Breaking News

జగజ్జేత ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. పసికూనల చేతిలో దారుణ ఓటమి

Published on Sun, 03/12/2023 - 19:09

టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌, 2022 పొట్టి ప్రపంచకప్‌ విన్నర్‌ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా  2-0 తేడాతో సిరీస్‌ను  కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్‌.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది.

ఈ సిరీస్‌లో తొలి రెం‍డు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్‌..అండర్‌ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్‌ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన బట్లర్‌ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్‌ మెహిది హసన్‌ మీరజ్‌ (4-0-12-4) ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించగా.. తస్కిన్‌ అహ్మద్‌ (1/27), ముస్తాఫిజుర్‌ (1/19), షకీబ్‌ అల్‌ హసన్‌ (1/13), హసన్‌ మహమూద్‌ (1/10) తలో చేయి వేశారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (25), మొయిన్‌ అలీ (15), బెన్‌ డక్కెట్‌ (28), సామ్‌ కర్రన్‌ (12), రెహాన్‌ అహ్మద్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌..  నజ్ముల్‌ షాంటో (46 నాటౌట్‌), తౌహిద్‌ హ్రిదోయ్‌ (17), మెహిది హసన్‌ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది.

స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్‌ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్‌ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కర్రన్‌, మొయిన్‌ అలీ, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)