Breaking News

ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. బుమ్రాను ఫాలో కానున్న క‌మ్మిన్స్‌!?

Published on Mon, 09/01/2025 - 13:00

యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల‌కు కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. క‌మ్మిన్స్ ప్ర‌స్తుతం వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ త‌ర్వాత క‌మ్మిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 

ఈ క్ర‌మంలోనే విండీస్‌తో టీ20 సిరీస్‌, సౌతాఫ్రికాతో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు దూర‌మ‌య్యాడు. అయితే నవంబర్ 21 నుండి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ స‌మ‌యానికి క‌మ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అంచనా వేసింది. కానీ ఊహించిన దానికంటే అతడి వెన్ను నొప్పి తీవ్రంగా ఉన్నట్లు . డైలీ మెయిల్ ప్రకారం.. కమ్మిన్స్‌ తాజా స్కానింగ్‌లో వెన్ను గాయం తీవ్రత తెలిసినట్లు సమాచారం

బుమ్రా బాటలో.. 
అయితే కమ్మిన్స్ టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బాటలో నడిచే అవకాశమున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో కమ్మిన్స్‌ను రెండు లేదా మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని ఆసీస్ సెలక్టర్లు భావిస్తున్నరంట. బుమ్రా సైతం ఇటీవలే ఆండర్సన్‌-టెండూల్కర్ ట్రోఫీలో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ భాగంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కమ్మిన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు.


కాగా కమ్మిన్స్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌, భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం​ ఉంది. మరి కొద్ది రోజుల్లో కమ్మిన్స్ ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. కమ్మిన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినప్పటికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ ఈ స్టార్ పేసర్‌ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమ్మిన్స్ భాగమయ్యాడు.

2025-26 యాషెస్ సిరీస్ తేదీలు:
పెర్త్ టెస్ట్ (వెస్ట్ టెస్ట్): పెర్త్ స్టేడియం | నవంబర్ 21-25
బ్రిస్బేన్ టెస్ట్ (డే/నైట్ టెస్ట్): గబ్బా | డిసెంబర్ 4-8
అడిలైడ్ టెస్ట్ (క్రిస్మస్ టెస్ట్): అడిలైడ్ ఓవల్ | డిసెంబర్ 17-21
మెల్బోర్న్ టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్): | డిసెంబర్ 26-30
సిడ్నీ టెస్ట్ (నూతన సంవత్సర టెస్ట్): ఎస్‌సీజీ | జనవరి 4-8
చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టులో పాసైన కెప్టెన్‌
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)