Breaking News

వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న కేన్‌ విలియమ్సన్‌.. 45వ శతకం

Published on Wed, 07/30/2025 - 15:54

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే మిడిల్‌సెక్స్‌తో జతకట్టిన కేన్‌.. అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసి, తాజాగా రెండో మ్యాచ్‌లోనూ శతకం నమోదు చేశాడు. కేన్‌ మామకు ఇది ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 45వ శతకం.

గ్లోసెస్టర్‌షైర్‌తో నిన్న (జులై 29) మొదలైన మ్యాచ్‌లో కేన్‌ 112 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. కేన్‌ అరంగేట్రం మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌పై 159 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 114 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుత మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిడిల్‌సెక్స్‌ 3 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. కేన్‌తో పాటు కెప్టెన్‌ లూస్‌ డు ప్లూయ్‌ (42) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌లో జాషువ డి కెయిర్స్‌ 58, సామ్‌ రాబ్సన్‌ 4, మ్యాక్స్‌ హోల్డన్‌ 14 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లోసెస్టర్‌షైర్‌ బౌలర్లలో మ్యాట్‌ టేలర్‌ 2, బెన్‌ చార్ల్స్‌వర్త్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, కేన్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టు దూరంగా ఉన్నాడు. మిడిల్‌సెక్స్‌తో ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. న్యూజిలాండ్‌ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటస్తుంది. ఈ పర్యటనలో కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి కేన్‌ స్వచ్చందంగా తప్పుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్‌ న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్‌ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)