Breaking News

శ‌త‌క్కొట్టిన బాబ‌ర్‌.. శ్రీలంక‌ను చిత్తు చేసిన పాక్‌

Published on Sat, 11/15/2025 - 08:51

వైట్‌బాల్ క్రికెట్‌లో పాకిస్తాన్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన  రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో అఫ్రిది సేన సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటిం‍గ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో జనిత్ లియానగే (54 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్‌(44 పరుగులు),  హసరంగా (37 నాటౌట్) , సమరవిక్రమ(42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్,హారిస్ రవూఫ్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.

బాబర్ సూపర్ సెంచరీ..
అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.2 ఓవర్లలో చేధించింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఆజేయ సెంచరీతో చెలరేగాడు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బాబర్ అంతర్జాతయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఈ మాజీ కెప్టెన్ 119 బంతుల్లో, 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫఖర్ జమాన్ (78 పరుగులు), మహ్మద్ రిజ్వాన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు మూడో వికెట్‌కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. లంక బౌలర్లలో చమీరా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)