Breaking News

PAK VS SA 2nd Test: బాబర్‌ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్‌

Published on Mon, 10/20/2025 - 18:19

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్‌ 20) రెండో టెస్ట్‌ మ్యాచ్‌ (Pakistan vs South Africa) మొదలైంది. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆట బ్యాలెన్స్‌గా సాగింది. ఇరు జట్లు ఆధిపత్యం విషయంలో సమంగా నిలిచాయి. ఓ సెషన్‌లో పాక్‌ ఆధిపత్యం సాధిస్తే.. మరో సెషన్‌లో సౌతాఫ్రికా ఆధిక్యత ప్రదర్శించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌ (16), మహ్మద్‌ రిజ్వాన్‌ (19) విఫలమైనా.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (87), ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (57) అర్ద సెంచరీలతో తమ జట్టును ఆదుకున్నారు. సౌద్‌ షకీల్‌ (42), సల్మాన్‌ అఘా (10) క్రీజ్‌లో ఉన్నారు.

పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 17 పరుగులు చేసిన ఇమామ్‌‌ ఉల్‌ హాక్‌ను 35 పరుగుల వద్దే సైమన్‌ హార్మర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆతర్వాత అబ్దుల్లా షఫీక్‌, షాన్‌ మసూద్‌ (Shan Masood) పాక్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.

ఆతర్వాత హార్మర్‌ పాక్‌కు మరో స్ట్రోక్‌ ఇచ్చాడు. 146 పరుగుల వద్ద షఫీక్‌ను ఔట్‌ చేశాడు. ఈ దశలో ఎప్పటిలాగే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) వరుస బౌండరీలతో అలరించాడు.

16 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బాబర్‌ను కేశవ​్‌ మహారాజ్‌ దెబ్బేశాడు. కేశవ్‌ బౌలింగ్‌లో టోనీ డి జోర్జీకి క్యాచ్‌ ఇచ్చి బాబర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత షాన్‌ మసూద్‌.. సౌద్‌ షకీల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఔటయ్యాడు. సెంచరీకి 13 పరుగుల ముందు మసూద్‌ను కేశవ్‌ మహారాజ్‌ ఔట్‌ చేశాడు.

ఆతర్వాత వచ్చిన మరో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 19 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రిజ్వాన్‌ వికెట్‌ పడ్డాక జాగ్రత్తగా ఆడిన పాకిస్తాన్‌ మరో వికెట్‌ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించింది.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్‌ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.

చదవండి: ఆఫ్ఘనిస్తాన్‌ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)