Breaking News

బాబర్‌ మెరుపులు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

Published on Mon, 11/24/2025 - 08:40

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్‌... ఆదివారం మూడో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 

సీనియర్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సయీమ్‌ అయూబ్‌ (8 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా... ఆఖర్లో ఫఖర్‌ జమాన్‌ (10 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షాట్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

జింబాబ్వే బౌలర్లలో సింకందర్‌ రజా 2 వికెట్లు పడగొట్టగా... బ్రాడ్‌ ఇవాన్స్, రిచర్డ్‌ నగరవ చెరో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్‌ బుర్ల్‌ (49 బంతుల్లో 67 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్‌ సికందర్‌ రజా (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.

పాకిస్తాన్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉస్మాన్‌ తారిఖ్‌ ‘హ్యాట్రిక్‌’ సహా 4 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌ రెండో బంతికి టోనీ (1)ని అవుట్‌ చేసిన అతడు... ఆ తర్వాత వరుస బంతుల్లో తషింగ ముసెకివా (0), వెల్లింగ్టన్‌ మసకద్జ (0)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మొహమ్మద్‌ నవాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్‌ 6 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. టోర్నమెంట్‌ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.
చదవండి: IND vs SA: పాపం సంజూ.. వ‌ర‌ల్డ్ మోస్ట్ అన్‌ల‌క్కీ క్రికెట‌ర్‌! అగార్కర్‌పై ఫైర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)