Breaking News

వైభ‌వ్ ఫెయిల్‌.. టీమిండియా కెప్టెన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

Published on Sat, 07/12/2025 - 20:10

ఇంగ్లండ్ పర్య‌ట‌న‌లో భార‌త అండ‌ర్‌-19 కెప్టెన్ ఆయూష్ మాత్రే ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా ఇంగ్లండ్‌-19 జట్టుతో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆయూష్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.

మొద‌టి ఇన్నింగ్స్‌లో మాత్ర‌మే వ‌న్డే త‌ర‌హాలో కేవ‌లం 107 బంతుల్లోనే త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 14 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 102 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఆరంభంలోనే టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ వికెట్‌ను కోల్పోయింది.

14 ప‌రుగులు చేసిన సూర్య‌వంశీ.. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో ఆయుష్ మాత్రే త‌న అద్భుత‌ బ్యాటింగ్‌తో ముందుండి నడిపించాడు.  నంబర్ త్రీ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో క‌లిసి మూడో వికెట్‌కు 173 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

త‌న సూప‌ర్ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ జ‌ట్టు బౌల‌ర్ల స‌హ‌నాన్ని ఈ సీఎస్‌కే బ్యాట‌ర్ ప‌రీక్షించాడు. 50 ఓవ‌ర్లు ముగిసే స‌రికి యువ భార‌త జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిజ్ఞాన్ కుండు(33), రాహుల్ కుమార్‌(32) ఉన్నారు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)