Breaking News

టీమిండియా కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

Published on Sat, 12/27/2025 - 21:35

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా  వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.

అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్‌లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్‌లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.

కెప్టెన్‌గా వైభవ్‌..
ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా  గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు.  మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

అండర్‌-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.

సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు
వైభవ్ సూర్యవంశీ(కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్,  ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)