Breaking News

ఆయూష్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్‌లో 28 ర‌న్స్‌! వీడియో వైర‌ల్‌

Published on Sun, 05/25/2025 - 16:52

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్‌కు కింగ్స్‌కు ఆయుష్ మాత్రే రూపంలో ఒక‌ అణిముత్యం దొరికింది. గాయ‌ప‌డిన రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో సీఎస్‌కే జ‌ట్టులోకి వ‌చ్చిన ఆయూష్‌.. ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ స‌త్తాచాటాడు. ఈ యువ ఆట‌గాడు త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో సీఎస్‌కేకు అద్బ‌త‌మైన ఆరంభాల‌ను అందించాడు. 

తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జరుగుతున్న సీఎస్‌కే ఆఖ‌రి మ్యాచ్‌లోనూ మాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆయూష్ కేవ‌లం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34 పరుగులు చేసి ఔట‌య్యాడు. చెన్నై ఇన్నింగ్స్ 2 ఓవ‌ర్ వేసిన గుజ‌రాత్ పేస‌ర్ ఆర్ష‌ద్ ఖాన్‌ను మాత్రే ఊతికారేశాడు.

ఓ ఓవ‌ర్‌లో మాత్రం మూడు సిక్స్‌లు, రెండు ఫోర్ల‌తో ఏకంగా 28 ప‌రుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు ప‌రుగులు తీసిన మాత్రే.. ఆ త‌ర్వాత రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ఆఖ‌రి బంతిని కూడా స్టాండ్స్‌కు త‌ర‌లించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

కాగా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో సీఎస్‌కే బ్యాటర్‌గా మాత్రే నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో ఉన్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో జడేజా.. హర్షల్ పటేల్ వేసిన ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. ఇక మాత్రే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు 240 ప‌రుగులు చేశాడు.
చదవండి: PBKS VS DC: అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా



 

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)