Breaking News

కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌

Published on Tue, 01/21/2025 - 09:05

కోల్‌కతా: భారత్‌ తరఫున మూడు ఫార్మాట్‌లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టి20 సిరీస్‌ కోసం అతను తొలిసారి వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్‌ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 

దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్‌ పటేల్‌ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్‌లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. 

ఫార్మాట్‌ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్‌ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్‌ అభిప్రాయపడ్డాడు. 

‘టీమ్‌ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. 

‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్‌లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్‌ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్‌ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ వ్యాఖ్యానించాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)