Breaking News

శివాలెత్తిన అక్షర్‌ పటేల్‌.. ఒకే ఓవర్‌లో..!

Published on Thu, 12/05/2024 - 15:30

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్‌ ప్లేయర్‌ అక్షర్‌ పటేల్‌ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్‌ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. 

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో విద్యాధర్‌ అనే వ్యక్తి బౌలింగ్‌లో అక్షర్‌ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్‌లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు.  ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్‌ విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ఓపెనర్‌ ఆర్య దేశాయ్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌, ఈ సీజన్‌లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్‌ పటేల్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్‌ దేశాయ్‌ 32 బంతుల్లో 47.. హేమంగ్‌ పటేల్‌ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్‌, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్‌ పాటిల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం​ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు​ 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్‌ రవిచంద్రన్‌ (49), మయాంక్‌ అగర్వాల్‌ (45), మనీశ్‌ పాండే (30), కృష్ణణ్‌ శ్రీజిత్‌ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, నగస్వల్లా చెరో 2, చింతన్‌ గజా, విశాల్‌ జేస్వాల్‌, ఆర్య దేశాయ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)