Breaking News

AUS vs BAN: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Published on Wed, 08/05/2026 - 13:58

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతుండ‌గా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండ‌ర్ మైఖేల్ నెసర్ కూడా చేరాడు. బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లో నెస‌ర్ కుడి పిక్క గాయానికి గురయ్యాడు.

ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు నెస‌ర్ దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీక‌రించాడు.

కాగా బంగ్లాతో టెస్టుల కోసం ప్ర‌క‌టించిన 13 మంది స‌భ్యుల ఆసీస్ ప్ర‌ధాన జ‌ట్టులో నెస‌ర్ లేడు. కానీ  కమిన్స్, హేజిల్‌వుడ్‌లకు బ్యాక‌ప్ బౌల‌ర్‌గా తీసుకోవాల‌ని ఆసీస్ సెల‌క్ట‌ర్లు భావించారు. కానీ ఇప్పుడు అత‌డు గాయ‌ప‌డ‌డంతో మరో ప్రత్యామ్నాయ బౌల‌ర్‌ను వెతుక్కోవాల్సి వ‌చ్చింది. 

యాషెస్ సిరీస్‌లో ఆడిన బ్రెండన్ డాగెట్‌ను తిరిగి జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. అయితే వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్న జోష్ ఇంగ్లిష్‌ మాత్రం తొలి టెస్ట్ స‌మ‌యానికి కోలుకుంటున్నాడని మెక్‌డొనాల్డ్ స్ప‌ష్టం చేశాడు. ఇక ఆగ‌స్టు 13 నుంచి డార్విన్ వేదిక‌గా బంగ్లాదేశ్‌-ఆసీస్ మ‌ధ్య‌ తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)