Breaking News

ఒక్క బంతి పడకుండానే...

Published on Wed, 02/26/2025 - 03:39

రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్‌ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్‌ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. 

తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్‌ అంప్లైర్లు క్రిస్‌ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్‌ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్‌)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్‌ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. 

గ్రూప్‌ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్‌ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే  మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్‌ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి.  

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
ఇంగ్లండ్‌ X అఫ్గానిస్తాన్‌
వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)