Breaking News

విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఆసీస్‌ తుది జట్టు ఇదే.. స్మిత్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభం

Published on Tue, 01/16/2024 - 13:09

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్‌తో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్‌ ఓపెనర్‌ అవతారమెత్తడంతో మరో ఓపెనర్‌ మ్యాట్‌ రెన్‌షా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కెమారూన్‌ గ్రీన్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్‌ రిటైర్మెంట్‌ అనంతరం ఆసీస్‌ ఆడుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే. 

మరోవైపు ఈ మ్యాచ్‌తో ముగ్గురు విండీస్‌ ఆటగాళ్లు టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్‌ హాడ్జ్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, షమార్‌ జోసఫ్‌లు సుదీర్ఘ ఫార్మాట్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడనున్నారు. 

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, మార్నస్‌ లబూషేన్‌, కెమరూన్‌ గ్రీన్‌, ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), మిచెల్‌ మార్ష్‌, పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లయోన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌

వెస్టిండీస్: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్‌కీపర్‌), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు