Breaking News

‘శత’క్కొట్టిన నిసాంక 

Published on Tue, 02/17/2026 - 05:19

పల్లెకెలె: పాథుమ్‌ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్‌ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో లంక జట్టు ‘సూపర్‌–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. 

ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్‌ ‘సూపర్‌–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్‌ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాసున్‌ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్‌ మిచెల్‌ మార్‌‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 

8.2 ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్‌ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్‌గ్లిస్‌ (27; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (22; 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాక్స్‌వెల్‌ రివర్స్‌ స్వీప్‌తో బౌండరీకి యత్నించగా... బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. 

లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో 97 పరుగులు, తర్వాత పవన్‌ రత్నాయకే (28 నాటౌట్‌; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు.

 ఆ్రస్టేలియా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 20న ఒమన్‌ జట్టుతో ఆడుతుంది. ఆసీస్‌ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు (నేడు ఐర్లాండ్‌తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్‌–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్‌రేట్‌లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్‌–8’ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు