Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య మార్పు

Published on Wed, 06/11/2025 - 07:36

లార్డ్స్‌ వేదికగా జూన్‌ 11న ప్రారంభమయ్యే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాయి. ఇరు జట్లలో ఊహించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓ అనూహ్య మార్పు చేసింది. మిడిలార్డర్‌లో కీలకమైన మార్నస్‌ లబూషేన్‌ను ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసింది. 

డేవిడ్‌ వార్నర్‌ రిటైరయ్యాక ఆసీస్‌ ఓపెనర్‌ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని మ్యాచ్‌ల్లో స్టీవ్‌ స్మిత్‌ను ప్రయోగించినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఉస్మాన్‌ ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ప్రయోగానికి పూనుకుంది. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్‌ కావడంతో ఓపెనర్‌గా లబూషేన్‌ ఏ మేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. 

మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ మార్పు చేసింది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్దర్‌ను వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేసింది. సౌతాఫ్రికా తుది జట్టులో ఏకంగా నలుగురు వికెట్‌కీపర్‌ బ్యాటర్లు (రికెల్టన్‌, స్టబ్స్‌, వెర్రిన్‌, బెడింగ్హమ్‌) ఉండటం విశేషం. అయితే మ్యాచ్‌లో మాత్రం వెర్రిన్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా టైటిల్‌ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్‌ సాధించలేకపోయిన సౌతాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్‌ చేసుకోకూడదని మహా పట్టుదలగా ఉంది.

డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్‌ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్‌ చేరి ఓడిన భారత్‌ ఈసారి తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

తుది జట్లు..

దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, 2. ర్యాన్ రికెల్టన్, 3. వియాన్ ముల్డర్, 4. టెంబా బవుమా (కెప్టెన్‌), 5. ట్రిస్టన్ స్టబ్స్, 6. డేవిడ్ బెడింగ్హమ్, 7. కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్‌), 8. మార్కో జన్సెన్, 9. కేశవ్ మహారాజ్‌, 10. కగిసో రబాడ, 11. లుంగి ఎంగిడి

ఆస్ట్రేలియా: 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లబూషేన్‌, 3. కెమరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్‌స్టర్, 7. అలెక్స్  క్యారీ (వికెట్‌కీపర్‌), 8. పాట్ కమిన్స్ (కెప్టెన్‌), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్‌ లియోన్‌, 11. జోష్‌ హాజిల్‌వుడ్‌

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)