Breaking News

టీమిండియాపై ఆసీస్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Sun, 03/19/2023 - 18:57

తొలి వన్డే ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదిచింది. ఆసీస్‌ ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(66), హెడ్‌(51) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

ఇక 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన ఆస్ట్రేలియా ఓ అరుదైన ఘనత సాధించింది. టీమిండియాపై వన్డేల్లో ఓవర్ల పరంగా అత్యధిక వేగంగా టార్గెట్‌ ఛేదించిన జట్టుగా ఆసీస్‌ నిలిచింది. అంతకుముందు 2019లో హామిల్టన్‌ వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో భారత్‌పై 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 14.4 ఓవర్లలో ఛేదించింది.

ఇప్పటివరకు ఇదే అత్యంత వేగమైన ఛేజింగ్‌ కాగా.. తాజా మ్యాచ్‌తో కివీస్‌ రికార్డును ఆసీస్‌ బ్రేక్‌ చేసింది. ఇక ఓవరాల్‌గా ఓవర్ల పరంగా  ఆస్ట్రేలియాకు ఇది మూడో అతి పెద్ద విజయం. అంతకుముందు 2004లో యూఏస్‌ఏపై 66 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే ఆసీస్‌ సాధించింది. ఇక  సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: AUS vs IND: మిచెల్ మార్ష్‌ విధ్వంసం.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో! ఢిల్లీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)