Breaking News

ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. కెప్టెన్‌గా మళ్లీ అతడే

Published on Mon, 06/08/2026 - 11:46

బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ సిరీస్‌కు ఆ జ‌ట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌, స్పిన్నర్ తన్వీర్ సంఘా దూర‌మ‌య్యారు. మార్ష్ చీలమండ గాయం (Ankle Injury) కార‌ణంగా త‌ప్పుకోగా.. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది.

మ‌రోవైపు పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌లో  గాయపడిన త‌న్వీర్ సంఘా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఇక మ‌రోసారి మార్ష్ స్ధానంలో జ‌ట్టు ప‌గ్గాల‌ను వికెట్ కీప‌ర్ జోష్ ఇంగ్లిష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సెల‌క్ష‌న్ క‌మిటీ అప్ప‌గించింది.

అయితే జూన్ 17 నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ సమయానికి జట్టుతో మార్ష్ కలుస్తాడని సెలెక్టర్ టోనీ డోడెమైడ్ తెలిపారు. కాగా కొత్తగా వన్డే జట్టులోకి మాథ్యూ షార్ట్‌, ఓలివర్ పీక్‌, టాడ్ మర్ఫీ వచ్చారు.  ఓలివర్ పీక్, షార్ట్ పాకిస్తాన్‌తో వన్డేలు ఆడినప్పటికి.. మర్పీకి మాత్రం తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. 

కాగా ఇరు జ‌ట్ల మ‌ధ్య ఈ వన్డే సిరీస్ జూన్ 9 (మంగళవారం) నుండి ఢాకాలో ప్రారంభం కానుంది. పాక్‌తో సిరీస్‌ను 2-1తో కోల్పోయిన కంగారులు తిరిగి త‌మ రిథ‌మ్‌ను అందుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

బంగ్లాతో వన్డేల‌కు ఆసీస్ జ‌ట్టు
జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కానల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్‌షా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! కేవ‌లం 10 బంతుల్లోనే
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)