Breaking News

AUS Vs WI: హాజిల్‌వుడ్‌ విజృంభణ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Fri, 01/19/2024 - 07:44

టెస్ట్‌ల్లో వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం​ సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఛాంపియన్‌ టీమ్‌.. తాజాగా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌ల్లో (తొలి) విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్‌వుడ్‌ (9/79), ట్రవిస్‌ హెడ్‌ (119) విజృంభించడంతో మ్యాచ్‌ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్‌పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. హాజిల్‌వుడ్‌ (4/44), కమిన్స్‌ (4/41) ధాటి​కి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (50), 11వ నంబర్‌ ఆటగాడు షమార్‌ జోసఫ్‌ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్‌ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. విండీస్‌ ఆరంగేట్రం​ పేసర్‌ షమార్‌ జోసఫ్‌ (5/94) ఆసీస్‌ను  దెబ్బతీశాడు. 

95 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్‌ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్‌ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్‌ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ఆడుతూపాడుతూ వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్‌ స్మిత్‌ 11, లబూషేన్‌ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్‌ ఖ్వాజా (9) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌  జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)