Breaking News

కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా

Published on Sun, 08/24/2025 - 16:31

ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్‌ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్‌కు అతి భారీ విజయం నెదర్లాండ్స్‌పై (2023 వన్డే వరల్డ్‌కప్‌లో 309 పరుగుల తేడాతో) దక్కింది.

యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ చేసిన స్కోర్‌ కూడా వారి వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్‌ తమ అతి భారీ స్కోర్‌ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కూపర్‌ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.

మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (142), మిచెల్‌ మార్ష్‌ (100), గ్రీన్‌ (118 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇ‍న్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించాడు.

అనంతరం​ కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్‌ కన్నోలీ (6-0-22-5), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (6-0-45-2), సీన్‌ అబాట్‌ (4-0-27-2), ఆడమ్‌ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఈ గెలుపుతో ఆసీస్‌ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్‌ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)