వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు

Published on Thu, 10/02/2025 - 08:50

మహిళలవన్డే వరల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యాష్లే గార్డ్‌నర్‌ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్‌ గార్త్‌(38) రాణించారు. స్టార్‌ ప్లేయర్లు బెత్‌ మూనీ(5), సదర్లాండ్‌(5), హీలీ(19) నిరాశపరిచారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో లీ తహుహు, జెస్‌ కెర్‌ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 

కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్‌ బౌలర్లలో సోఫీ, అనాబెల్‌ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్‌ తలపడుతుంది.
చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)